News November 8, 2024

రాజానగరం: ‘ఏపీ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి’

image

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆంగ్ల విభాగం, రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి, సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం – సదస్సు’ ముగింపు వేడుక జరిగింది. మంత్రి దుర్గేష్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు

Similar News

News December 14, 2024

అమలాపురం: విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు: జేసీ 

image

విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు అని విద్యుత్ పొదుపుగా వాడి ఆధా చేస్తూ భావితరాలకు ఇంధన వనరులపై భరోసాను కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి ప్రజలకు పిలుపు నిచ్చారు. శనివారం అమలాపురం కలెక్టరేట్ నుంచి గడియారపు స్తంభం వరకు నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్‌లో జండా ఊపి ప్రారంభించగా ట్రాన్స్‌కో సిబ్బంది ఇంధనాన్ని ప్రతి ఒక్కరూ పొదుపు చేయాలని సూచించారు.

News December 14, 2024

కాకినాడ సిపోర్టు వద్ద మరో చెక్పోస్ట్ ఏర్పాటు

image

పేదల ఆహార భద్రత కోసం నిర్దేశించిన పీడీఎఫ్ బియ్యం రీసైక్లింగ్, అక్రమ ఎగుమతులను నిరోధించే చర్యలలో భాగంగా కాకినాడ జిల్లాలో మరో చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేసిన్నట్లు కలెక్టర్ షాన్ మోహన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాకినాడ సీ పోర్ట్ వద్ద మరో చెక్ పోస్టును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కాకినాడ సిపోర్టు వద్ద లారీల రద్దీ ఎక్కువ ఉండకుండా పోలీస్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించామని తెలిపారు.

News December 13, 2024

తూ.గో: ఆకట్టుకుంటున్న పసుపు రంగు సీతాఫలాలు

image

కడియం నర్సరీలలో పసుపు రంగు సీతాఫలాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కడియంకు చెందిన నర్సరీ రైతు దుర్గారావు మూడేళ్ల క్రిందట థాయిలాండ్ నుంచి మొక్కను తెచ్చి ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా పెంచి పోషించారు. రైతు దుర్గారావు మాట్లాడుతూ..ప్రస్తుతం మొక్క ఇప్పటికి పెద్దదై పూత పూసిందని సంవత్సరానికి రెండుసార్లు దిగుబడిని ఇస్తుందని, లోపల గుజ్జు ఎంతో రుచిగా ఉంటుందన్నారు. దీనితో పండ్ల ప్రేమికులు సందర్శిస్తున్నారు.