News March 3, 2025

రాజానగరం: నన్నయ్య వీసీని ప్రశంసించిన సీఎం

image

బాపట్ల జిల్లా స్టూవర్టుపురానికి చెందిన తొలి ఎరుకలి సామాజికవర్గ మహిళ సాతుపాటి ప్రసన్నశ్రీ. ప్రస్తుతం ఈమె రాజానగరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. ఈ విషయంపై CM చంద్రబాబు ‘X’ వేదికగా స్పందించారు. ప్రసన్నశ్రీ కథ ఆమె విశేషమైన అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. ఆమె ప్రయత్నాలకు తగిన గుర్తింపు రావడం సంతోషాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 4, 2025

రాజమండ్రి: కొనసాగుతున్న కౌంటింగ్.. దూసుకుపోతున్న పేరాబత్తుల

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.

News March 4, 2025

ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని నెల చివరికి సాధించాలి: కలెక్టర్

image

ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 5000 హెక్టార్ల లక్ష్యానికి 2821 హెక్టార్ల ప్రగతి సాధించడం జరిగినదని, మిగిలిన లక్ష్యాన్ని మార్చి నెల ఆఖరికి పూర్తి చేయాలని  కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా సూక్ష్మ సేద్య శాఖ, ఆసియాన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖల పనితీరుపై జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడుతో కలిసి సమీక్షించారు.

News March 3, 2025

రాజమండ్రి: హత్య కేసులో జీవిత ఖైదు

image

2021 సెప్టెంబర్‌లో  రాజమండ్రిలోని సీటీఆర్ఐ సెంటర్ వద్ద జరిగిన హత్య కేసులో ఒక నేరస్థుడికి సోమవారం కోర్టు శిక్ష విధించింది. వాద ప్రతివాదనలు విన్న తర్వాత జడ్జి ఆర్.శ్రీలత ముద్దాయి యర్రా సాయికి జీవితకాలం ఖైదు అలాగే రూ. 20 వేల జరిమానా విధించింది. ఈ కేసు పురోగతిలో సహకరించిన పీపీ రాధాకృష్ణరాజు, త్రీ టౌన్ సీఐ అప్పారావు, ఏఎస్ఐ వెంకటేశ్వర్లులను, ఎస్పీ నర్సింహ కిషోర్‌ను కోర్టు అభినందించింది.

error: Content is protected !!