News October 9, 2024
రాజానగరం: భూపాలపట్నంలో డ్రగ్స్ కలకలం

రాజానగరం మండలం భూపాలపట్నంలో ఓ బర్త్ డే పార్టీలో ముగ్గురు యువకులు డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం ఓ ఫంక్షన్ హాల్ వద్ద జరుగుతున్న బర్త్ డే ఫంక్షన్లో పాల్గొన్న ముగ్గురు యువకులు కారులో కూర్చుని డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. యువకులకు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్న కోణంలో కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.
Similar News
News November 3, 2025
నేడు యథాతథంగా పీజీఆర్ఎస్: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం యథాతథంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండా తమ డివిజన్, మండల కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలు సమర్పించి సమస్యలకు పరిష్కారం పొందాలని ఆమె సూచించారు. ఫిర్యాదులను 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా Meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 2, 2025
1,185 కుటుంబాలకు రూ.23.26 లక్షల సాయం: కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లాలో 1,185 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.23.26 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మొంథా’ తుపాను ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో మండల స్థాయిలో లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
News November 2, 2025
తాళ్లపూడిలో నేటి చికెన్ ధరలు ఇలా

కార్తీక మాసం కారణంగా తాళ్లపూడి మండలంలో మాంసం విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆదివారం నాటికి కిలో చికెన్ రూ.200-220 పలుకుతుండగా, నాటుకోడి రూ.600, మేక మాంసం రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు గణనీయంగా తగ్గడంతో వ్యాపారం మందగించిందని వ్యాపారులు చెబుతున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయగలరు.


