News February 20, 2025

రాజానగరం : రెండు లారీల మధ్య నలిగిపోయి వ్యక్తి మృతి 

image

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమూరు గామన్ బ్రిడ్జిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు ఇనుప ఊచలు లోడుతో వెళ్తున్న లారీని డ్రైవర్ శ్రీనివాసరావు(45) రోడ్డు పక్కకు ఆపి, టైర్లలో గాలి చెక్ చేస్తుండగా మరో లారీ ఢీకొంది. ప్రమాదంలో రెండు లారీల మధ్య నలిగి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడని ఎస్ఐ మనోహర్ తెలిపారు.

Similar News

News March 16, 2025

రాజమండ్రి: క్యారమ్స్ ఆడిన కలెక్టర్, ఎస్పీ

image

నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన క్యారం బోర్డు వద్దకు కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ డి.నరసింహ కిషోర్, కమిషనర్ కేతన్ గార్గ్‌లు వెళ్లి ఆటవిడుపుగా కొద్దిసేపు క్యారమ్స్ ఆడారు. కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం సమీక్షా సమావేశం జరిగింది. బిజీ బిజీగా ఉండే కలెక్టర్, ఎస్పీ, కమిషనర్‌లు తిరుగు పయనంలో క్యారమ్స్ ఆడి వినోదం పొందారు. ఆ దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రాజమండ్రి: 16న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు స్క్రీనింగ్ టెస్ట్

image

ఏపీపీఎస్సీ ద్వారా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల స్క్రీనింగ్ పరీక్షలు మార్చి 16వ తేదీన నిర్వహిస్తున్నట్లు జేసీ ఎస్.చిన్న రాముడు తెలిపారు. పరీక్షల నిర్వహణపై రాజమండ్రిలో సమీక్ష నిర్వహించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హల్ టికెట్‌తో పాటు, ప్రభుత్వం గుర్తించి అసలు ఫోటో గుర్తింపు కార్డుతో పరీక్ష ప్రారంభించడానికి గంట ముందే.. ఎగ్జాం సెంటర్‌కు చేరుకోవాలని చెప్పారు. 

error: Content is protected !!