News February 17, 2025
రాజానగరం: రోడ్డు ప్రమాదంలో తోడికోడళ్లు మృతి

రాజానగరం జాతీయ రహదారిపై దివాన్ చెరువు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానవరానికి చెందిన ఇద్దరు తోడి కోడళ్లు మృతి చెందారు. గ్రామస్థుల వివరాల మేరకు.. మహిళలు రిప్కో, చంద్రమ్మ నాగేశ్వరరావుతో కలిసి పాలచర్లలో కూలి పనికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో బైక్ పై వస్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావుని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 27, 2025
రాజమండ్రి : వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. నిందితుడి అరెస్ట్

వైద్య విద్యార్థిని అంజలి ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దీపక్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. బొల్లినేని కిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ దీపక్, అంజలిపై లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు కుటుంబీకులు ఆరోపించి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. గురువారం అతన్ని అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ భవ్య కిశోర్ వెల్లడించారు.
News March 27, 2025
రాజమండ్రి : వెంటిలేటర్‌పై అంజలి

రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న అంజలి వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతోంది. దీనికి ఏజీఎం దీపకే కారణమని విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రకాశ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి కుటుంబీకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యంలో ఏమాత్రం మెరుగులేదని వైద్యులు తెలిపారు. కాగా ఆమె తల్లిదండ్రులు తమ కూతురు బతికి వస్తుందని, రావాలని ఆశతో ఎదురుచూస్తున్నారు.
News March 27, 2025
గోదావరిలోకి దూకేసిన యువకుని మృతదేహం లభ్యం

ఏమైందో.. ఏమో గాని రాజానగరం కొత్త కాలనీకి చెందిన మునసా వీరబాబు (19) బుధవారం సాయంత్రం రాజమండ్రి గోదావరిలోకి దూకేశాడు. స్నేహితుడు వెంకీతో కలిసి బైక్‌పై రంపచోడవరం వెళ్లి తిరిగి వచ్చిన వీరబాబు రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదకి చేరుకుని, సెల్ ఫోన్‌ను స్నేహితునికి ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంకి ద్వారా సమాచారం అందుకున్న రాజమండ్రి పోలీసులు గల్లంతైన వీరబాబు మృతదేహాన్ని వెలికితీశారు.