News March 10, 2025
రాజానగరం: 12మంది క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

రాజానగరం హైవేని ఆనుకుని ఉన్న బ్రిడ్జ్ కౌంటీలోని ఒక విల్లాలో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాను రాజానగరం పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. వివిధ జిల్లాలకు చెందిన 12మంది బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 26 మొబైల్స్, 7 ల్యాప్ట్యాప్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దుబాయ్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఛాంపియన్షిప్ క్రికెట్ పోటీపై ఈ బెట్టింగ్స్ జరిగాయి.
Similar News
News March 22, 2025
రాజమండ్రిలలో P4పాలసీ కార్యక్రమం

P4 పాలసీ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. P4 పాలసీ ద్వారా ప్రభుత్వం వెనుకబడిన కుటుంబాలను ప్రత్యక్షంగా దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అన్నారు. ప్రజల నిజమైన అవసరాలను తీర్చడం, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వారి అభివృద్ధికి తోడ్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
News March 21, 2025
రాజమండ్రిలో అధికారుల మెరుపు దాడులు

తూర్పుగోదావరి జిల్లాలో ఈగల్ టీం శుక్రవారం మెరుపు దాడులు చేసింది. పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసింది. రాష్ట్రంలోని యువత మత్తు పదార్థాలను ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నట్లు సమాచారం ఉండటంతో దాడులు నిర్వహించామని విజిలెన్స్ అధికారి ఎం.స్నేహిత, డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు. రాజమండ్రి గణేశ్ చౌక్ వద్ద ఉన్న ఓ మెడికల్ ఏజెన్సీలో ట్రెమడల్ మెడిసిన్ స్వాధీనం చేసుకున్నారు.
News March 21, 2025
తూ.గో జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

తూ.గో జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పల్లెల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా రాజమండ్రిలో 36 డిగ్రీలు, గోపాలపురం 32 డిగ్రీలు, కొవ్వూరు 36 డిగ్రీలు నమోదైంది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.