News November 28, 2024
రాజానగరం: 29న పీజీ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్స్
నన్నయ విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎం.ఏ, ఎం.కామ్, ఎంపీఈడీ, ఎంఎస్సీ కోర్సుల్లో భర్తీ చేయని సీట్లకు 29న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నామని వీసీ వై.శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ పీజీసెట్ రాయకపోయినా, రాసి అర్హత సాధించకపోయినా స్పాట్ అడ్మిషన్‌లో పీజీ కోర్సులో ప్రవేశం పొందవచ్చన్నారు. డిగ్రీలో ఉత్తీర్ణత శాతం ఓసీ, బీసీలకు 50శాతం, ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం సాధించిన వారు అర్హులన్నారు.
Similar News
News December 9, 2024
తూ.గో: మళ్లీ పులి సంచారం.?
తూ.గో. జిల్లా ఏజెన్సీ ఏరియాలో కొద్దిరోజులుగా పులి సంచారం ప్రజలను భయపెడుతోంది. ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లోనూ పులి సంచరిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాపన్నధార ఏరియాలో ఆదివారం ఓ పశువు చనిపోవడంతో పోలీసు అధికారులకు స్థానికులు సమాచారమిచ్చారు. పశువును చంపింది పులి లేదా ఏదైనా అడవి జంతువా అనేది అధికారులు నేడు క్లారిటీ ఇవ్వనున్నారు. ఇటీవల 45 రోజులపాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పులి తిరిగింది.
News December 9, 2024
నేడు ప్రజా సమస్యల అర్జీల స్వీకరణ: తూ.గో కలెక్టర్
రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం గ్రివెన్స్ డేను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశానని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 8, 2024
9న తేదీన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ రద్దు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని ఈనెల 9వ తేదీన నిర్వహించడం లేదని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. శనివారం ఆయన కాకినాడ కలెక్టరేట్ నుండి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అనివార్య కారణాల వలన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.