News April 29, 2024

రాజాo: 78 మంది అరెస్ట్

image

ఈ ఏడాది జనవరి 1 నుంచి 28 వరకూ 252.99 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు రాజాం సెబ్ సీఐ బి. శ్రీధర్ వెల్లడించారు. 70 కేసులు నమోదు చేసి 78 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. 2,700 లీటర్ల పులిసిన బెల్లం ఊటలను ధ్వంసం చేసి మూడు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 120 మందిని బైండోవర్ చేయడంతోపాటు 9 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు వెల్లడించారు.

Similar News

News October 15, 2024

కుమందానివానిపేటలో విషాదం.. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద మృతి

image

సంతబొమ్మాళి మండలం కుమందానివానిపేటలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన డెక్కల రాజు, దుర్గ దంపతుల కుమారులు బాలాజీ(10), రిషి(8) మంగళవారం ఉదయం నాటికి అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఉదయం ఇంట్లో ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా పడి ఉండడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారుల మృతికి కారణాలు తెలియరాలేదు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

News October 15, 2024

శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్

image

శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు వెలువడ్డాయి. గజపతినగరం ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి వర్గంలో ఉన్న కొండపల్లి శ్రీనివాస్‌ను జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా నియమించారు. జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని డా.బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా నియమించారు. ఈ మేరకు ఆయా మంత్రులకు ఇన్‌ఛార్జ్ స్థానాలను కేటాయించారు.

News October 15, 2024

ఎచ్చెర్ల అంబేడ్కర్ యూనివర్సిటీలో మినీ జాబ్‌మేళా

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా “మినీ జాబ్ మేళా” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా మేనేజర్ ఉరిటి సాయికుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 18న ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేళాలో మూడు కంపెనీలు పాల్గొంటున్నాయని సుమారు 50 ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.