News August 29, 2024
రాజీనామా వెనుక బలమైన కారణాలు: మోపిదేవి

తాను వైసీపీకి రాజీనామా చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని మోపిదేవి వెంకట రమణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామాకు గల కారణాలు అన్ని మీడియాకు చెప్పుకోలేనని అన్నారు. రాజ్యసభపై తనకు ఆసక్తి లేదని స్థానిక రాజకీయాల్లోనే ఉండాలనుకున్నానని అన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించినప్పుడే రాజీనామా చేయాలని అనుకున్నట్లు ఆయన చెప్పారు.
Similar News
News December 3, 2025
అమరావతి: సచివాలయంలో బారికేడ్ల తొలగింపు

అమరావతి సచివాలయంలో ఇనుప బారికేడ్లను తొలగించారు. బారికేడ్ల వల్ల ప్రజలు, సందర్శకులు ఇబ్బంది పడుతున్నారని గమనించిన సీఎం చంద్రబాబు.. వెంటనే వాటిని తొలగించాలని పోలీసులను ఆదేశించారు. బ్లాకుల ముందు బారికేడ్లకు బదులుగా పూల కుండీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన బారికేడ్లను తొలగించి, ఆ స్థానంలో అందమైన క్రోటాన్, పూల మొక్కలను ఏర్పాటు చేశారు.
News December 3, 2025
నడింపాలెంలో రూ. 93.82 కోట్లతో CRIYN, 100 పడకల ఆసుపత్రి

ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 100 పడకల ఆసుపత్రి, సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి (CRIYN) నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. రాజ్యసభ వేదికగా ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నకు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.93.82 కోట్ల అంచనాతో ఈ నిర్మాణం ఉండబోతోందని చెప్పారు.
News December 3, 2025
రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.జి.ఆర్.ఎస్లో అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.


