News March 17, 2025
రాజీవ్ యువ వికాసం పథకం సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సీతక్క

రాజీవ్ యువ వికాసం పథకం కింద నిరుద్యోగ యువతకు రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. కావున ములుగు జిల్లాలోని యువతి, యువకులు అందరూ దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దీనికి స్థానిక పార్టీ శ్రేణులు తమ తమ గ్రామాల్లో ఉన్న యువతీ యువకులకు తెలియచేయాలని మంత్రి సీతక్క తెలిపారు.
Similar News
News March 18, 2025
చిత్తూరులో భారీగా పోలీసుల బదిలీ

చిత్తూరు జిల్లా పరిధిలోని పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. పోలీస్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 219 మంది సిబ్బందిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయగా.. మరికొందరిని వీఆర్‌కు పంపించారు. పుంగనూరులో టీడీపీ నాయకుడి హత్య నేపథ్యంలోనే భారీ స్థాయిలో పోలీసులను బదిలీ చేసినట్లు సమాచారం.
News March 18, 2025
MBNR: యువత దేశం కోసం పాటుపడాలి: VC శ్రీనివాస్

భారత ప్రభుత్వం యువజన సర్వసులు, క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం పాలమూరు యూనివర్సిటీలోని రైబ్రరీ ఆడిటోరియంలో “జిల్లా స్థాయి యువ ఉత్సవ్-2025” ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా V.C Dr.G.N శ్రీనివాస్ మాట్లాడుతూ.. యువత దేశ అభివృద్ధికి పాటుపడుతూ 2047కి ప్రపంచానికి శాసించే విధంగా యువత పాటుపడాలన్నారు. రిజిస్ట్రార్ చెన్నప్ప, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
News March 18, 2025
నల్గొండ: మద్దతు ధర పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

2024 -25 రబీ ధాన్యం మార్కెట్‌కు రానున్న నేపథ్యంలో రబీ ధాన్యం సేకరణకు పౌరసరఫరాలు, వ్యవసాయ అనుబంధ శాఖలు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణ, మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జిలకు ఉద్దేశించి శనివారం ఉదయాదిత్య భవన్‌లో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు మద్దతు ధర పోస్టర్ ఆవిష్కరణ చేశారు.