News March 24, 2025
‘రాజీవ్ యువ వికాసం పథకాన్ని స్వదినియోగం చేసుకోండి’

ఏప్రిల్ 5లోపు రాజీవ్ యువ వికాసం పథకానికి బీసీ, ఈబీసీ, EWS నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి జ్యోతి తెలిపారు. జిల్లాలోని వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిందని, దీనిని సద్వనియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News December 17, 2025
ఖమ్మం విద్యార్థికి 18 ఉద్యోగాలు.. మెచ్చిన గూగుల్

గూగుల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కాంపిటీషన్‌లో ఖమ్మం విద్యార్థి వేమిరెడ్డి కార్తీక్ రెడ్డి రెండో స్థానంలో నిలిచి రూ.6.50 లక్షల బహుమతిని అందుకున్నారు. ఖమ్మంలో ఇంటర్ నుంచి బీటెక్ వరకు పూర్తి చేసిన కార్తీక్ రెడ్డి తర్వాత ఉద్యోగంలో చేరారు. తర్వాత ఈ అంతర్జాతీయ పోటీలో విజేతగా నిలిచారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లోనూ 18 ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
News December 17, 2025
ఖమ్మం జిల్లాలో.. 168 జీపీలకు నేడే పోలింగ్

ఖమ్మం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 191 గ్రామ GPలకు గానూ 22 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 168 జీపీలకు నేడు పోలింగ్ జరగనుంది. ఏన్కూరు(21), కల్లూరు(23), పెనుబల్లి(32), సత్తుపల్లి(21), తల్లాడ (27), వేంసూరు (26), సింగరేణి(41) మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేశారు.
* GP ఎలక్షన్ల అప్డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి.
News December 16, 2025
ఖమ్మం: 18 నుంచి 22 వరకు రేషన్ బియ్యం

ఈ నెల 18 నుంచి 22 వరకు రేషన్ షాపులలో బియ్యం లభ్యత ఉంటుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. పోర్టబిలిటీ బియ్యం కోసం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ బియ్యాన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేశామని, రేషన్ లబ్ధిదారులు ఈ తేదీల్లో వారికి సమీపంలో గల దుకాణాల నుంచి పోర్టబిలిటీ ద్వారా బియ్యం పొందాలని ఆయన కోరారు.


