News April 5, 2025
రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకోండి: కలెక్టర్

భద్రాద్రి జిల్లాలోని బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్ (EBC, EWS) నిరుద్యోగులైన యువతీ, యువకులు రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రాజీవ్ యువ వికాసం ద్వారా యువతీ, యువకులు ఆర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధిని పెంపొందించుకునే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. tgobmmsnow.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈనెల 14వతేదీ లోపు అప్లై చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 10, 2025
ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి

ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి చెందింది. కంబాలకొండ నుంచి జింకలు తరచుగా రోడ్డుపైకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జింక రోడ్డుపైకి ఆకస్మికంగా రావడంతో, అటుగా వస్తున్న బస్సు ఢీకొంది. జింక అక్కడికక్కడే మృతి చెందింది. కంబాలకొండ అడవి నుంచి ఇలా రోడ్డెక్కిన జింకలు తరచుగా ప్రమాదాలకు గురై, తీవ్ర గాయాలు లేదా మరణం సంభవిస్తున్నాయి. మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
News December 10, 2025
150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
అన్‌క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

బ్యాంకుల్లో ₹78,000Cr అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్‌లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.


