News April 1, 2025
రాజీవ్ యువ వికాసానికి ఎక్కువ మంది అప్లయ్ చేసుకోవాలి: డిప్యూటీ సీఎం

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాద్ నుంచి సీఎస్ శాంతికుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 16, 2025
మెగా డీఎస్సీ.. ఏలూరు జిల్లాలో 1,063 మంది క్వాలిఫై

మెగా డీఎస్సీలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1,063 మంది అభ్యర్థులు అర్హత సాధించారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ సోమవారం వెల్లడించారు. ఏప్రిల్ 24న 13,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆగస్టు 1న తుది ‘కీ’ విడుదలైంది. సెప్టెంబర్ 15న విడుదలైన క్వాలిఫై జాబితాలో ఏలూరు జిల్లా నుంచి 1,063 మంది ఎంపికైనట్లు ఆమె తెలిపారు. ఏ విభాగంలో ఎంతమంది అర్హత సాధించారన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News September 16, 2025
భూమికి సమీపంగా భారీ ఆస్టరాయిడ్

ఓ భారీ గ్రహశకలం త్వరలో భూమికి సమీపంగా రానున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2025 FA22 అనే ఆస్టరాయిడ్ సెప్టెంబర్ 18 ఉ.8.33 గం.కు భూమికి అత్యంత సమీపంలోకి రానుందని చెబుతున్నారు. అప్పుడు ఇది భూమికి 8,41,988 కి.మీ. దూరంలోనే ప్రయాణించనుంది. అయితే ఆ శకలం గురుత్వాకర్షణ పరిధిలోకి రాదని అంటున్నారు. దీని చుట్టుకొలత 163.88 మీ., పొడవు 280 మీ.గా ఉంది. నాసా దీని కదలికలను పరిశీలిస్తోంది.
News September 16, 2025
మాజీ రంజీ క్రికెటర్ ఎస్. సత్యదేవ్ కన్నుమూత

కాకినాడకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ ఎస్. సత్యదేవ్ (84) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. 1964-65 సీజన్లో విశాఖపట్నం – హైదరాబాద్తో ఆయన అరంగేట్రం చేశారు. ఆల్ రౌండర్గా గుర్తింపు పొందారు. 16 రంజీ మ్యాచ్ల్లో ఒక సెంచరీతో సహా 503 పరుగులు చేశారు. ఆయన మృతికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సతీశ్ బాబు, తూ.గో క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.