News April 1, 2025

రాజీవ్ యువ వికాస పథకంపై ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశాలు

image

రాజీవ్ యువ వికాస పథకానికి అర్హులైనవారు ఎక్కువగా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాదులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమక్షంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. యువత ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకం ప్రారంభించినట్టు తెలిపారు.

Similar News

News November 16, 2025

iBOMMA, BAPPAM సైట్లు బ్లాక్

image

iBOMMA, BAPPAM సైట్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు. దీంతో నిన్న రాత్రి నుంచి ఆ సైట్లు ఓపెన్ అవ్వడం లేదు. iBOMMA సైట్‌లో 1XBet అనే <<18296786>>బెట్టింగ్‌<<>>, ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌ను నిర్వాహకుడు ఇమ్మడి రవి ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సినిమాలు చూసేవారిని బెట్టింగ్ వైపు మళ్లించడం అతడి ప్లాన్ అని, ఇందుకోసం బెట్టింగ్ కంపెనీల నుంచి భారీగా నిధులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

News November 16, 2025

పల్నాడు: కాక రేపుతున్న వారసత్వ రాజకీయాలు

image

పల్నాడు జిల్లాలో వారసత్వ రాజకీయాలు కాక రేపుతున్నాయి. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, జీవి ఆంజనేయులు తమ వారసులను రాజకీయ బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందు నుంచే తమ వారసులను ప్రజలలోకి పంపి రాజకీయ ఒడిదుడుకులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

News November 16, 2025

త్వరలో HYDలో ఎనిమీ ప్రాపర్టీ ప్రాంతీయ కార్యాలయం

image

రాష్ట్రంలో ఎనిమీ ప్రాపర్టీలు పరిరక్షణ కోసం HYDలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముంబై ప్రాంతీయ కార్యాలయం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల వ్యవహారాలు చూస్తోంది. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల్లో ఎనిమీ ప్రాపర్టీలపై రెవెన్యూశాఖ సర్వే నిర్వహించింది. మియాపూర్ పరిధిలో వందల ఎకరాలు ఉండగా, కొంతభాగం అక్రమ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు.