News April 2, 2025
రాజీవ్ యువ వికాస పథకంపై విస్తృత అవగాహన కల్పించండి: కలెక్టర్

రాజీవ్ యువ వికాస పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. అర్హులైన యువత ఆన్లైన్లో దరఖాస్తు చేసి, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పిస్తే, వాటిని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన హెల్ప్ డెస్క్ ద్వారా ఆన్లైన్ చేస్తామని తెలియజేశారు. అధికారులు ప్రజలకు అవగహన కల్పించాలన్నారు.
Similar News
News December 7, 2025
మహబూబ్నగర్: భార్యాభర్తలు సర్పంచ్, ఉపసర్పంచ్

గద్వాల మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శనివారం ఉపసంహరణ ముగియడంతో గ్రామం ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. గ్రామంలో సర్పంచ్గా శకుంతలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, ఆమె భర్త వార్డు సభ్యుడిగా ఏకగ్రీవమై, ఆపై ఉపసర్పంచ్గా ఎన్నిక కావడం విశేషం. ఇకపై ఈ భార్యాభర్తలు పదవుల్లో కొనసాగనున్నారు.
News December 7, 2025
విశాఖ: AU మాజీ VC ప్రసాద్ రెడ్డికి జైలు శిక్ష

AU మాజీ VC ప్రసాద్ రెడ్డికి ఒక నెల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. AUలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన నూకన్నదొరను తొలగిస్తూ 2022లో ప్రసాద్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై నూకన్నదొర హైకోర్టును ఆశ్రయించగా.. విధుల్లో కొనసాగించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. దీనిని అమలు చేయకపోవడంతో హైకోర్టు ఈ శిక్షను విధించింది. అయితే అప్పీల్ చేసుకునేందుకు 6 వారాల సమయం ఇచ్చింది.
News December 7, 2025
తూప్రాన్: ‘కాళ్లు మొక్కుతా.. ఓటేసి మద్దతు ఇయ్యండి’

పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాళ్లు మొక్కుతా.. ఓటేసి మద్దతు ఇవ్వండి అంటూ ఓ అభ్యర్థి కాళ్లు పట్టి వేడుకున్నాడు. ఈ ఘటన శనివారం రాత్రి తూప్రాన్ ఐడీఓసీ భవనంలో గుర్తుల కేటాయింపు సమయంలో చోటుచేసుకుంది. ఇస్లాంపూర్(తూప్రాన్) సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సంతోష్ రెడ్డి కాంగ్రెస్లో చేరిపోయారు. బీఆర్ఎస్లో చేరిన స్వతంత్ర అభ్యర్ధి బీములు కాంగ్రెస్ నాయకుడి కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు.


