News April 3, 2025
‘రాజీవ్ యువ వికాస పథకాన్ని సద్వినియోగం చేసుకోండి’

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువకుల కోసం తెచ్చిన రాజీవ్ యువవికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవలని సిద్దిపేట జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి నాగ రాజమ్మ ప్రకటనలో తెలిపారు. బుధవారం మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు , జైన్, పార్సీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలన్నారు. ఈ నెల 14లోగా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News December 1, 2025
HNK: సర్పంచ్ ఎన్నికలు.. సోషల్ మీడియాపై అభ్యర్థుల ఫోకస్

జిల్లాలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న నేపథ్యంలో సర్పంచ్‌కు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు సోషల్ మీడియాపై ప్రత్యేక ఫోకస్ పెట్టి తమను గెలిపిస్తే చేసే పనులు, ఎజెండాలను స్టేటస్, గ్రూప్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం ఏ మాత్రం ఉంటుందో చూడాల్సి ఉంది.
News December 1, 2025
కడప: ‘సమస్యలపై ఇవాళ రాకండి’

కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుసే అవకాశం ఉండడంతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలతో రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఉండే వికలాంగులు, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు వినతులు ఇచ్చేందుకు రావొద్దని ఆయన సూచించారు.
News December 1, 2025
MNCL: నూతన మద్యం పాలసీ అమలు.. అమ్మకాల జోరుకు సిద్ధం

మంచిర్యాల జిల్లాలో 73 వైన్ షాపులకు సోమవారం నుంచి 2025-27 సంవత్సరానికి సంబంధించిన నూతన మద్యం పాలసీ అమలు కానుంది. కొత్త షాపులు రాబోయే 3 నెలల పాటు భారీ అమ్మకాలతో కళకళలాడతాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. డిసెంబర్ 17 వరకు ఎన్నికల కోలాహలం, జనవరి తొలి వారం సెలబ్రేషన్స్‌తో పాటు జనవరి చివరిలో సమ్మక్క సారలమ్మ జాతర అమ్మకాలు అబ్కారీ శాఖకు భారీ ఆదాయాన్ని సమకూర్చనున్నాయి.


