News February 7, 2025

రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గోదావరిఖని వాసులు మృతి

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గోదావరిఖని నుంచి HYD వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న గోదావరిఖనికి చెందిన బాణేష్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్‌కు తరలించారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 7, 2025

ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్‌కు అలవాటే: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘కుల గణనతో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని ఏ చట్టంలో ఉంది. ముస్లింలను కూడా కలిపి బీసీలకు అన్యాయం చేశారు. కుల గణన జరిపిన విధానమే సరిగ్గా లేదు. ఈ సర్వేపై బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కులాలు, మతాల పేరిట ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్‌కు అలవాటే’ అని విమర్శించారు.

News February 7, 2025

హీరో నాగార్జునను కలిసిన అనంతపురం ఎంపీ

image

ఢిల్లీలోని పార్లమెంటులో సినీ నటుడు అక్కినేని నాగార్జునను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కలిశారు. ప్రధాని మోదీని కలిసేందుకు పార్లమెంటుకు వచ్చిన ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాగార్జున ప్రధానిని కలిశారు. అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

News February 7, 2025

విజన్-2047కు సహకరించండి: చంద్రబాబు

image

AP: స్వర్ణాంధ్ర విజన్ 2047కు సహకరించాలని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీని CM చంద్రబాబు కోరారు. అమరావతిలో ఆయనతో CM భేటీ అయ్యారు. ‘రాష్ట్రంలో ఏటా 15 శాతం వృద్ధి సాధించి 2047కల్లా 42 వేల డాలర్ల తలసరి ఆదాయానికి అందరూ చేరుకునేలా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో అత్యుత్తమ పాలసీలు అమలు చేస్తున్నాం. నీతి ఆయోగ్ మద్దతు ఉంటే ఇంకాస్త ముందుకెళ్తాం. 2047కల్లా APని మోడల్ స్టేట్‌గా మార్చవచ్చు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!