News February 7, 2025
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గోదావరిఖని వాసులు మృతి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గోదావరిఖని నుంచి HYD వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న గోదావరిఖనికి చెందిన బాణేష్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్కు తరలించారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 26, 2025
సర్పంచ్ ఎన్నికల కోసం మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా డిసెంబర్లో నిర్వహించే సర్పంచ్ ఎన్నికల కోసం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మీడియా కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ తిరుమల పాల్గొన్నారు.
News November 26, 2025
పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.
News November 26, 2025
గద్వాల: ‘ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేయాలి’

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నియమావళిని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ కార్యాలయం నుంచి తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎంపీడీవోలకు తహశీల్దారులు సహకరించాలని సూచించారు. అవసరం మేరకు జీపీఓల సేవలను ఎన్నికల విధుల్లో వినియోగించుకోవాలన్నారు.


