News March 9, 2025

రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

ఆ ఉద్యోగి ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుదామనుకున్నాడు. కానీ అంతలోనే విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పిడుగురాళ్ల (M) జూలకల్లుకు చెందిన సంధ్యానాయక్ హైకోర్టులో ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో శనివారం రాత్రి ఇంటికి వస్తుండగా రెడ్డిగూడెం సమీపంలో లారీ కిందపడి స్పాట్‌లోనే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 16, 2025

విజయవాడలో నేటి నెన్‌వెజ్ ధరలివే.! 

image

విజయవాడలో చికెన్ ధరలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్కిన్‌లెస్ కిలో ధర రూ.180గా ఉండగా స్కిన్ రూ.170గా కొనసాగుతుంది. అలాగే కోడిగుడ్లు మాత్రం గత వారంతో పోలిస్తే పెరిగింది. గుడ్లు గత వారం రూ.138 ఉండగా నేడు రూ.144లకు పెరిగింది. ఇలాగే విజయవాడలో కేజీ రూ.180 ఉన్న చేపల ధర రూ.220లకు పెరిగింది. కేజీ మటన్ రూ.900లుగా కొనసాగుతోంది. 

News March 16, 2025

NLG: మండలానికి మరో రెండు రైతు నేస్తం కేంద్రాలు!

image

రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా రైతు నేస్తం కేంద్రాలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి NLG జిల్లాలో 315 రైతు వేదికల్లో 77 రైతు నేస్తం కేంద్రాలని నిర్వహిస్తోంది. మండలానికి మరో రెండు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రతినెల నిధులు మంజూరు చేసి రైతులకు మరింత పరిజ్ఞానం అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

News March 16, 2025

శ్రీచైతన్య స్కూల్‌లో ఘర్షణ.. భవనంపై నుంచి కింద పడ్డ బాలిక

image

తిరుపతిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో ఓ విద్యార్థిని రెండో ఫ్లోర్‌ నుంచి కింద పడిపోవడం కలకలం రేపింది. విద్యార్థినుల మధ్య గొడవ జరిగిన సమయంలో తోటి విద్యార్థిని ఆమెను పైనుంచి తోసేసిందని సమాచారం. కిందపడిన బాలికకు నడుం విరగడంతో పాటు తీవ్రగాయాలయ్యాయి. స్కూల్ యాజమాన్యం ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు. ఘటనపై తిరుపతి అర్బన్ తహశీల్దార్ విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!