News February 16, 2025

రాజుపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం  

image

రాజుపాలెం మండలం నెమలిపురి దగ్గర అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళుతున్న ఓ కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి,ఇద్దరు కుమారులు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News February 25, 2026

కడప: 3వ రోజు ఇంటర్ పరీక్షలకు 96% విద్యార్థులు హాజరు

image

కడప జిల్లాలో బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్-1 పరీక్షకు 96% విద్యార్థులు హాజరయ్యారు. నేడు 62 సెంటర్లలో 18,165 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 17,391 మంది రాశారు. 774 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 16,685 మందికి గాను.. 16,068 మంది హాజరవ్వగా, 617 మంది పరీక్షలు రాయలేదు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,480 మందికి గాను.. 1,323 మంది హాజరవ్వగా, 157 మంది గైర్హాజరయ్యారు.

News February 25, 2026

ఉపాధి పనులు శనివారంలోపు ప్రారంభించాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ, ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర అంశాలపై కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకం కింద మంజూరైన పనులన్నీ శనివారం నాటికి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అక్షరాంధ్రకు నమోదు చేసుకున్న వారందరూ తప్పనిసరిగా పరీక్షలకు హాజరు కావాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.

News February 25, 2026

‘మామ్స్ బ్రెయిన్’ అంటే ఏమిటి?

image

సాధారణంగా ప్రసవం తర్వాత కొందరు మహిళలు మతిమరుపునకు లోనవుతుంటారు. దీన్నే”మామ్స్ బ్రెయిన్” అంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. డెలివరీ తర్వాత బిడ్డ సంరక్షణలో పడి పోషకాహారం తీసుకోవడం మానేస్తారు. బాలింతలు మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు, పండ్లు, పప్పు దినుసులు తీసుకోవడం వల్ల బాలింతలు ఆరోగ్యంగా ఉండి మతిమరుపు, ఇతర సమస్యలకు దూరంగా ఉండవచ్చు.