News February 16, 2025
రాజుపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

రాజుపాలెం మండలం నెమలిపురి దగ్గర అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళుతున్న ఓ కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి,ఇద్దరు కుమారులు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News March 23, 2025
కాకినాడ జీజీహెచ్‌ను వదలని జీబీఎస్ కేసులు

కాకినాడ ప్రభుత్వాసుపత్రిని జీబీఎస్ కేసులు వదలడం లేదు. ఇప్పటివరకు 9మందికి పైగా గిలియన్ బారే సిండ్రోమ్ బాధితులు ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. శనివారం ఇద్దరు పేషెంట్లు కొత్తగా చేరారు. ప్రస్తుతం ఐదుగురు పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ లావణ్యకుమారి తెలిపారు. జ్వరం, శ్వాసకోశ సమస్యలు బలహీనత తదితర అంశాలతో బాధపడేవారు జీజీహెచ్‌కు రావాలని ఆమె సూచించారు.
News March 23, 2025
కశింకోటలో యాక్సిడెంట్.. UPDATE

కశింకోట మండలం త్రిపురవానిపాలెం జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అనకాపల్లి నుంచి ఎలమంచిలి వైపు వెళుతున్న లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా అవతలి రోడ్డుకు వెళ్లడానికి లారీని మలుపు తిప్పాడు. అదే మార్గంలో వస్తున్న మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో వెనక లారీ డ్రైవర్ షేక్ మస్తాన్ వల్లి అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు
News March 23, 2025
ఎచ్చెర్ల: ఆరుగురిపై క్రిమినల్ కేసులు

కుప్పిలి ఆదర్శ పాఠశాల విద్యార్థుల మాస్ కాపీయింగ్‌కు ఉపాధ్యాయులు సహకరించారని శ్రీకాకుళం డీఈఓ తిరుమల చైతన్య ఎచ్చెర్ల పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆరుగురు ఉపాధ్యాయులతోపాటు మరికొందరి పాత్ర ఉందని డీఈఓ ఫిర్యాదు చేయగా ఎఫ్ఎఆర్‌లో వారి పేర్లు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. సందీప్ కుమార్ చెప్పారు.