News July 23, 2024

రాజేంద్రనగర్: ముర్ర జాతి పశువులతో మేలు!

image

HYD నగరం రాజేంద్రనగర్ వెటర్నరీ విశ్వవిద్యాలయ అధికారులు ముర్ర జాతి పశువులతో ఎంతో లాభం జరుగుతుందని తెలిపారు. ముర్ర జాతి పశువులు పొడువైనా మెడ, వెడల్పు కలిగిన మూతిని కలిగి ఉంటాయన్నారు. అత్యధికంగా పాలు సైతం అందిస్తాయని తెలిపారు. మరో జాతికి చెందిన పశువులను పెంచే వారు, యూనివర్సిటీకి వచ్చి తగిన సూచనలు పొందవచ్చన్నారు.

Similar News

News November 24, 2025

HYD సిటీ కంటే ‘సింగారం’ బెస్ట్

image

పట్నంలో ఇరుకు రహదారులు, ట్రాఫిక్‌తో ప్రజలు విసిగిపోతున్నారు. విశాల ప్రాంతమైన సిటీ శివారు ప్రతాపసింగారానికి షిఫ్ట్ అవుతున్నారు. పట్నానికి 10 కిలోమీటర్ల దూరం ఉండడంతో ఇక్కడ ఇళ్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్ఫోసిస్-ORR సమీపం కావడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ప్రయాణ సౌలభ్యం పెరిగింది. ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ పూలింగ్ స్కీం కింద 130 ఎకరాలను సేకరించి అభివృద్ధి చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది.

News November 24, 2025

HYD: రూ.50 వేలకు 10th సర్టిఫికెట్!

image

నార్సింగి పోలీసుల దాడిలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా నకిలీ సర్టిఫికెట్లు, బోనాఫైడ్‌ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క టెన్త్‌ సర్టిఫికెట్‌ను రూ.50,000కి, ఇంటర్‌ను రూ.75,000కి, డిగ్రీ సర్టిఫికేట్‌ను రూ.1.20 లక్షలకు అమ్మడం గమనార్హం.

News November 24, 2025

GHMC ఎన్నికలపై KTR ఫోకస్

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రాబోయే GHMC ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించారు. KTR నేడు పార్టీ ప్రధాన కార్యాలయంలో BRS ఎమ్మెల్యేలు, MLCలు, మాజీ MLAలు, GHMC కార్పొరేటర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలు, GHMCలోని సమస్యల మీద పోరాటాలపై నేతలకు KTR దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.