News March 17, 2025
రాజేంద్రనగర్ NIRDPRలో రూ. లక్ష జీతంతో ఉద్యోగం

రాజేంద్రనగర్‌లోని NIRDPRలో కాంట్రాక్ట్ బేసిస్ కింద 33 పోస్టులను భర్తీ చేస్తున్నారు. బీటెక్, PG, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు మాత్రమే అర్హులు. వయస్సు 60 ఏళ్లకు మించకూడదు. జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ. 1,00,000, ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ. 1,40,000, ప్రోగ్రాం ఆఫీసర్‌రు రూ. 1,90,000 జీతం చెల్లిస్తారు. అప్లై చేసేందుకు మార్చి 19 చివరి తేదీ.
SHARE IT
Similar News
News March 18, 2025
Co-Living: హైదరాబాద్‌లో కొత్త కల్చర్!

HYDలో Co-Living కల్చర్ పెరుగుతోంది. ఒకే హాస్టల్, ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉండొచ్చు. IT కారిడార్, హైటెక్స్, మాదాపూర్, KPHB తదితర ప్రాంతాల్లో ఇటువంటి PG హాస్టల్స్ వెలిశాయి. పైగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ మరీ ఆకర్షిస్తున్నారు. వాస్తవానికి ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన యువత ఎక్కువగా హాస్టళ్లలోనే ఉంటారు. ఇందులో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే హాస్టళ్లలో ఉండేందుకు మొగ్గుచూపడం విశేషం.
News March 18, 2025
RR కలెక్టరేట్‌లో 72 ఫిర్యాదులు స్వీకరణ

ప్రజావాణి ఆర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్రజావాణిలో ఫిర్యాదుదారులు అందజేసిన ఆర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలసి స్వీకరించారు. అధికారులు తక్షణమే స్పందిస్తూ వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. రెవెన్యూ 40, ఇతర శాఖల్లో 32, మొత్తం 72 ఫిర్యాదులు స్వీకరించారు.
News March 17, 2025
RR: ఇంటర్ పరీక్షకు 84,599 మంది హాజరు

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ 1st ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 185 సెంటర్లలో 87,313 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 84,599 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 2,714 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.