News March 29, 2024

రాజేష్ మహాసేన పోస్ట్.. APR 1న ఏం చెప్పనున్నారు..?

image

రాజేష్ మహాసేన సోషల్ మీడియోలో పెట్టిన పోస్ట్‌పై ఆసక్తి నెలకొంది. ‘తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, పార్టీ మారుతానని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 2019లో జగన్ కోసం పని చేసి మోసం పోయాం. తర్వాత జనసేన కోసం కష్టపడ్డా అవకాశం రాలేదు. TDP నుంచి అనివార్య కారణాలతో అవకాశం కోల్పోయాం. అందుకే ‘మహాసేన’ చెప్పినట్లు చేయాలనుకుంటున్నా. అదేంటో APR 1న తెలిజయేస్తా’ అని రాసుకొచ్చారు. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది.

Similar News

News November 22, 2025

‘రైతన్న- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

image

ఈ నెల 24 నుంచి 29 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ‘రైతన్న- మీకోసం వారోత్సవాలు’ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం ఆమె వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 29 వరకు రైతుల ఇళ్లను సందర్శించాలని, ఆ సమాచారాన్ని డిసెంబర్ 2 వరకు విశ్లేషించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారోత్సవాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

News November 22, 2025

తూ.గో జిల్లాకు రాష్ట్రంలో ప్రథమ స్థానం

image

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు గణాంకాలలో తూర్పు గోదావరి జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం గర్వకారణమని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం పేర్కొన్నారు. 75.54 శాతం మార్కులతో జిల్లా ఈ ఘనత సాధించిందన్నారు. సేవల్లో నాణ్యత, ఆరోగ్య ప్రచార కార్యక్రమాల నిర్వహణతో ఆదర్శంగా నిలిచి రాష్ట్రంలో ప్రథమ స్థానం వచ్చినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.

News November 22, 2025

“తూర్పు”లో టెన్త్ రాయనున్న 26,619 విద్యార్థులు

image

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ కె.వాసుదేవరావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 26,619 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివి విజయం సాధించాలని డీఈఓ సూచించారు.