News March 18, 2025
రాజోలి: TGPSC ఫలితాల్లో సత్తాచాటిన జిల్లా యువకుడు

ఇవాళ TGPSC విడుదల చేసిన ఫలితాల్లో గద్వాల జిల్లా యువకుడు సత్తా చాటాడు. రాజోలి మండలంలోని పెద్ద తాండ్రపాడు గ్రామానికి చెందిన కృష్ణ- చిన్నమ్మల కుమారుడు ప్రసాద్ హాస్టల్ వెల్ఫేర్ ఫలితాల్లో సత్తాచాటి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఎలాంటి శిక్షణ తీసుకోకుండా ఒకవైపు కాకతీయ యూనివర్సిటీలో MEDచదువుతు హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు సన్నద్ధమైనట్లు ఆయన తెలిపారు. మండల ప్రజలు అభినందనలు తెలియజేశారు.
Similar News
News December 5, 2025
సూర్యాపేట: ‘పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణకు పకట్బందీ ఏర్పాట్లు చేయాలి’

పోస్టల్ బ్యాలెట్ నిర్వహణకు ఫెసిలిటేషన్ సెంటర్లలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవి నాయక్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాలకు కేటాయించిన ఎన్నికల పరిశీలకులు, జిల్లాల కలెక్టర్లు, పంచాయితీరాజ్, పోలీస్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News December 5, 2025
గన్నవరం చేరుకున్న కన్నడ సూపర్ స్టార్

కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ శుక్రవారం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. బొండా సిద్ధార్థ, గుమ్మడి నరసయ్య, డైరెక్టర్ పరమేశ్వర్ తదితరులు, అభిమాన సంఘాల నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి శివరాజ్ కుమార్ ఇంద్రకీలాద్రికి చేరుకొని కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొంటారు.
News December 5, 2025
వరంగల్ మార్కెట్లో పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత నాలుగు రోజులతో పోలిస్తే నేడు పత్తి ధర పెరిగింది. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం క్వింటా పత్తి ధర రూ.7,100 పలికింది. ఈ క్రమంలో నేడు రూ.50 పెరిగి రూ.7,150 అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. దీంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో కొనుగోళ్లు-అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.


