News February 28, 2025

రాజోలులో అగ్నిమాపక అధికారి మృతి

image

ఒక్కరోజు డ్యూటీ చేసుంటే పూర్తిగా విశ్రాంతి తీసుకునేవారు. అంతలోనే ఆకస్మికంగా మృతి చెందారు. రాజోలు గాంధీనగర్‌లో ఉంటున్న అగ్నిమాపక అధికారి బాలకృష్ణ (62) నిన్న ఉదయం మృతిచెందారు. రాజోలు అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్ ఫైర్‌మెన్‌గా పనిచేసి 3నెలల క్రితం పదోన్నతిపై ముమ్మిడివరం ఫైర్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. రోజూ మాదిరిగానే బైక్‌పై డ్యూటీకి వెళ్తుండగా రాజోలులో ఆకస్మికంగా బైక్‌పై నుంచి పడి చనిపోయారు.

Similar News

News October 19, 2025

సిద్దిపేట: కాల్చకుండానే పేలుతున్న పటాకుల ధరలు !

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో దీపావళి పటాకుల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. టపాసులపై GST, కెమికల్స్ ధరలు తగ్గినా ధరలు మాత్రం దిగలేదు. చిన్నా పెద్ద తేడా లేకుండా కాల్చే కాకర పుల్లల ధరలు సైతం గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. ఒక్కో దాని కుల్ల ప్యాకెట్ ధర రూ.30 నుంచి రూ.100 వరకు పలుకుతుంది. చిచ్చుబుడ్డులు, లక్ష్మి, సుతిల్ బాంబులతో పాటు ఇతర టపాకాయలు ధరలు ఎక్కువగానే ఉన్నాయి.

News October 19, 2025

టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి: భూపాలపల్లి కలెక్టర్

image

దీపావళి పండగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో జిల్లా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. దీపావళి  వెలుగులు ప్రతి ఇంటికి సంతోషం, ఆరోగ్యం, ఆనందాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు.

News October 19, 2025

PGఎల్‌సెట్-2025 సీటు అలాట్మెంట్ ప్రారంభం

image

AP లాసెట్&పీజీఎల్‌సెట్-2025 అడ్మిషన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 21, 22న వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తిచేసి క్లాసులకు హాజరు కావాలని మహిళా వర్సిటీ కార్యాలయం పేర్కొంది. సీట్ అలాట్మెంట్ 25న ఉంటుందన్నారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌ సైట్ https://cets.apsche.ap.gov.in ను చూడాలని సూచించారు. తరగతులు అక్టోబర్ 27 నుంచి ప్రారంభమవుతాయని వారు తెలిపారు.