News September 20, 2024
రాజోలులో 54 కిలోల లడ్డూ వేలం
రాజోలు మండలం కూనవరం గ్రామంలో గురువారం రాత్రి 54 కిలోల వినాయకుడి లడ్డూ వేలం వేశారు. ఇందులో భక్తులు పోటాపోటీగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా ఆ లడ్డూను స్థానిక భక్తుడు పిల్లి రామకృష్ణ రూ.73 వేలకు దక్కించుకున్నారు. ఈ లడ్డూను ఊరేగింపుగా తీసుకు వెళ్లి భక్తులకు ప్రసాదంగా పంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News October 14, 2024
మారేడుమిల్లి: పరుగు పరుగున వెళ్లినా ప్రాణాలు దక్కలేదు
మండలంలోని సున్నంపాడు పంచాయతీ పరిధిలోని నూరుపూడికి చెందిన కె.తమ్మిరెడ్డికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. రహదారి సరిగ్గా లేకపోవడం, మార్గమధ్యలో పెద్ద కొండ కాలువ ఉండడంతో అంబులెన్స్ రావడానికి అవకాశం లేకపోయింది. దీనితో గ్రామస్థులు తమ్మిరెడ్డిని డోలీ ద్వారా పరుగు పరుగున 8 కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే సున్నంపాడు వద్ద మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు.
News October 14, 2024
అమలాపురం: నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం రద్దు
అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించాల్సి ఉన్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మద్యం షాపుల లైసెన్సుల లాటరీ ప్రక్రియ నేపథ్యంలో కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అన్ని డివిజన్, మండల స్థాయి కార్యాలయాలలో ఈ కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది తెలిపారు.
News October 14, 2024
తూ.గో: పిడుగులు పడతాయి జాగ్రత్త
తూ.గో జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ అధికారులు సోమవారం పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. రాజమండ్రి రూరల్, రావులపాలెం, కోనసీమ, తుని, మారేడుమిల్లి, రంపచోడవరం, పెద్దాపురం, సామర్లకోట కోరుకొండ, రాజమండ్రి రూరల్ పరిధిలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నివారణ సంస్థ ప్రజల చరవాణిలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.