News January 24, 2025
రాజోలు: ఆలయ శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే

రాజోలు మండలం కూనవరం గ్రామంలో శ్రీఅన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం భూమి పూజలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తోందన్నారు. దీనికి ప్రజలు సహకారం అందించాలని కోరారు. ఎంపీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Similar News
News December 31, 2025
PGRSలో 9,300 సమస్యలు పరిష్కారం: కడప ఎస్పీ

కడప జిల్లాలో 2025 ఏడాదికి ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక(PGRS)లో 9,704 పిర్యాదులు వచ్చాయని.. వాటిలో 9,300 ఫిర్యాదులు నిర్ణీత గడువులోపు పరిష్కరించినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. ప్రజాసేవ, సమాజంలో భాగస్వామ్యం, చట్టం అమలులో ఉన్నత ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందినట్లు తెలిపారు. 2026లో మరింత అంకితభావంతో ప్రజలకు ఉన్నతమైన సేవలు అందిస్తామని తెలిపారు.
News December 30, 2025
నంద్యాల: విషాదం.. తల్లి, కుమార్తె మృతదేహాలు లభ్యం

గడివేముల మండలంలోని ఉండుట్ల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి తన ఇద్దరు పిల్లలతో ఈనెల 28న ఎస్సార్బీసీ కాలువలో దూకిన ఘటనలో మంగళవారం విషాదం నెలకొంది. ఎస్సై నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన గాలింపు చర్యల్లో లక్ష్మీదేవి, ఆమె కుమార్తె వైష్ణవి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే, నాలుగు నెలల చిన్నారి సంగీత ఆచూకీ ఇంకా లభించలేదని పోలీసులు తెలిపారు. చిన్నారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
News December 30, 2025
డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పోచంపల్లి

శాసనమండలిలో BRS డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని BRS అధినేత కేసీఆర్ నియమించారు. BRS అగ్రనేతలకు శ్రీనివాస్ రెడ్డి విధేయుడుగా ఉంటూ రెండు సార్లు వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శ్రీనివాస్ రెడ్డి నడికూడ మండలంలోని వరికోలు గ్రామానికి చెందినవారు.


