News March 5, 2025
రాజోలు: తప్పిపోయిన బాలిక కథ సుఖాతం

కాకినాడకు చెందిన 7వ తరగతి విద్యార్థిని సాధ్విక సోమవారం రాత్రి తప్పిపోయింది. రాజోలు (M) తాటిపాక సెంటర్లో బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆమె రాజోలు హాస్టల్లో ఉండగా… బాబాయి పెళ్లికి ఇంటికి వెళ్లింది. మంగళవారం నుంచి పరీక్షలు ఉండడంతో మేనమామ హాస్టల్ వద్ద విడిచిపెట్టగా తప్పిపోయింది. స్టేషన్లో ఉన్నట్లు తెలుసుకున్న వార్డెన్ జ్యోతి బాలికను పేరెంట్స్ కు అప్పగించారు.
Similar News
News March 23, 2025
SRHvsRR: జట్లు ఇవే

SRH: హెడ్, అభిషేక్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అభినవ్, అనికేత్, కమిన్స్, సిమర్‌జీత్, హర్షల్, షమీ
RR: జైస్వాల్, రాణా, జురెల్, పరాగ్, హెట్‌మెయిర్, శుభమ్ దూబే, జోఫ్రా, తీక్షణ, సందీప్, తుషార్ దేశ్‌పాండే, ఫరూఖీ
News March 23, 2025
తడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తడ మండలం పెరియావట్టు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నై నుంచి ఉబ్బల మడుగు పర్యాటక కేంద్రానికి వెళుతుండగా కారు చెట్టుకు ఢీకొంది. ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు స్పీడ్ వల్ల నుజ్జు నుజ్జు అయినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News March 23, 2025
షాద్‌నగర్‌లో హాస్టల్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం

షాద్‌నగర్ పట్టణంలోని బాలుర హాస్టల్ పైఅంతస్తు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి దూకాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్‌కి చెందిన చందు ఈరోజు మధ్యాహ్నం బిల్డింగ్ పైనుంచి అకస్మాత్తుగా కిందికి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశాడనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.