News January 25, 2025

రాజోలు: నలుగురు విద్యార్థులకు భారీ ఉపకార వేతనాలు

image

రాజోలు మండలం ఓ ప్రేయివేట్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినిలు రిలయన్స్ ఫౌండేషన్, లెగ్రాండ్ సంస్థలు అందించిన భారీ ఉపకార వేతనాలు అందుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ ఆర్.ఏ.స్వామి శనివారం తెలిపారు. గిరుగు సుష్మ (రూ.4,40,000), చింతా హెప్సిబా (2,00,000), బండారు తేజావతి (2,00,000), ముచ్చర్ల కేశవ కుమారి (2,00,000) ఉపకార వేతనం పొందారని తెలిపారు. భారీ ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులను పలువురు అభినందించారు.

Similar News

News December 8, 2025

రాజమండ్రి: నేడు PGRS కార్యక్రమం

image

డిసెంబర్ 8న (సోమవారం) జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ నుంచి సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథాతథంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పౌర సేవల కోసం వాట్సాప్ నంబర్ 95523 00009 అందుబాటులో ఉందని తెలిపారు. ఫిర్యాదుదారులు దీనిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

News December 8, 2025

KMR: స్థానిక పోరులో కొత్త ట్రెండ్

image

కామారెడ్డి జిల్లాలో సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వినూత్న వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు.. ఎన్నో ఏండ్లుగా తగాదాల కారణంగా దూరమైన ఓటర్ల వద్దకు నేరుగా వెళ్తున్నారు. పాత విభేదాలు, ఘర్షణలను పక్కన పెట్టి, ‘క్షమించండి’ అంటూ చేతులు జోడిస్తున్నారు. ఈ భావోద్వేగపూరిత ప్రచారం ఓటర్లపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.