News November 5, 2024

రాజోలు: వృద్ధుడి హత్య.. బంగారం, నగదు చోరీ

image

రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో జగ్గారావు (93)ని హత్య చేసి ఇంట్లోని 22 గ్రాములు బంగారం, రూ.40 వేలు నగదు చోరీ చేశారని మృతుని మనవడు శ్రీకాంత్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని సీఐ నరేశ్ కుమార్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన సందీప్ హత్యకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. మృతుడి ఇంట్లో దొంగతనం కేసులో సందీప్ జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడని, ఆ కక్షతో వృద్ధుడిని హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.

Similar News

News December 8, 2025

తూ.గో: టెన్త్ విద్యార్థులకు సూచన

image

డిసెంబర్ 9 లోపు టెన్త్ పరీక్షా ఫీజు చెల్లించాలని డీఈవో వాసుదేవరావు తెలిపారు. జిల్లాలో టెన్త్ మార్చి -2026లో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు రెగ్యులర్ /2025 ఫెయిల్ అయిన విద్యార్థులు గమనించాలన్నారు. 10 – 12వ తేదీ లోపు రూ.50, 13-15వ తేదీ వరకు రూ.200, 16 – 18 వరకు రూ.2,500 ఫైన్‌తో చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్కూల్ లాగిన్ ద్వారానే ఫీజ్ చెల్లించాల్సి ఉంటుందన్నారు.

News December 8, 2025

పట్టు బిగిస్తున్న కందుల దుర్గేశ్

image

నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ పట్టు బిగిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నైనా సీటు త్యాగం చేసిన బూరుగుపల్లి శేషారావుకి మళ్లీ ఛాన్స్ ఇస్తారా? అన్నది సందేహంగానే ఉంది. ఇప్పటికే మున్సిపాలిటీలో జనసేన పాగా వేసింది. 6 పీఎసీఎస్, ఏఎంసీ, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో జనసేన ఆధిపత్యం నడుస్తోంది. మంత్రి వ్యూహాత్మకంగా జనసేనను బలోపేతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శేషారావు రాజకీయ భవిష్యత్తు చర్చనీయాంశం అయింది.

News December 8, 2025

నిడదవోలు మున్సిపాలిటీలో తారుమారైన పార్టీ బలాలు

image

నిడదవోలు మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. గత ఎన్నికల్లో 28 స్థానాలకు గాను 27 గెలుచుకున్న వైసీపీ బలం ప్రస్తుతం 12కు పడిపోయింది. ఒక్క కౌన్సిలర్ లేని జనసేన ఏకంగా 15 మంది సభ్యులతో పాటు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలను దక్కించుకుంది. ఇక్కడి జనసేన ఎమ్మెల్యే మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీకి కలిసొచ్చింది. ఇదే సమయంలో టీడీపీ ఇక్కడ ఉనికి కోల్పోవడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.