News November 23, 2024
రాజ్యాంగానికి అతీతంగా చంద్రబాబు పాలన: కాకాణి
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అరాచకపాలనకు సీఎం చంద్రబాబు బీజాల వేశాడని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. YSRCP అధినేత జగన్, ఆయన కుటుంబీకులపై అనుచిత పోస్ట్‌లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన వేదాయాపాలెం P.Sలో ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని కాకాణి హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తల ఆవేదనను ప్రభుత్వం తట్టుకోలేదని స్పష్టం చేశారు.
Similar News
News December 13, 2024
చిల్లకూరు మండలంలో పొంగి పొర్లుతున్న వాగులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నిన్న కురిసిన భారీ వర్షాలకు చిల్లకూరు మండలంలోని పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని నాంచారమ్మపేట నుంచి పారిచర్ల వారి పాలెం గ్రామం మధ్యలో ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వాగు ప్రభావితం తగ్గేవరకు అటువైపు వెళ్లే వాహనదారులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు.
News December 13, 2024
గూడూరు: డాక్టర్ వేధిస్తున్నారంటూ ఫిర్యాదు
వాకాడు మండలం నిడిగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ వైద్యాధికారి వేధిస్తున్నారంటూ పలువురు మహిళా ఉద్యోగుల ఆరోపించారు. ఈ మేరకు వారు గురువారం సాయంత్రం గూడూరు డీఎస్పీతోపాటూ విజయవాడలోని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌కు లికిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితుడిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
News December 13, 2024
ఏపీలో పౌర విమానయానం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి: వేమిరెడ్డి
ఏపీలో పౌర విమానయానం అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమిటి అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురువారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపాదించిన విమానాశ్రయాలు పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని తెలియజేయాలన్నారు. ఏవియేషన్ ప్రాజెక్టుల ప్రయోజనం కోసం కేటాయించిన నిధులను తెలియజేయాలన్నారు. సహాయ మంత్రి మురళీధర్ సమాధానమిచ్చారు.