News November 26, 2024
రాజ్యాంగ దినోత్సవం: సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన సీఎస్
భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం డా.బీ. ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సెక్రటేరియట్ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతనం రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఏడీ ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ వెంకట్‌రావు, పలువురు అదనపు కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News December 13, 2024
HYD: అగ్నివీర్ల ట్రైనింగ్‌పై ప్రశంసలు
సికింద్రాబాద్ EME కేంద్రాన్ని సీనియర్ కల్నల్ కమాండెంట్ సిదాన సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ట్రైనింగ్, అడ్మినిస్ట్రేషన్‌లను పరిశీలించారు. అనంతరం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, బేసిక్ స్టాండర్డ్స్ మిలిటరీ ట్రైనింగ్, అగ్ని వీర్లకు అందిస్తున్న ట్రైనింగ్ విధానాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో వివిధ స్థాయి మిలిటరీ అధికారులు పాల్గొన్నారు.
News December 13, 2024
HYD: Xలో అల్లు అర్జున్ బెయిల్ ట్రెండింగ్..!
HYDలో ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ కాగా తాజాగా హైకోర్టు మధ్యంతర బెల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జాతీయ అవార్డు పొందిన నటుడి అరెస్ట్, బెయిల్ ట్విట్టర్ Xలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. HYDలో హీరో అల్లు అర్జున్ అరెస్టు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపింది.
News December 13, 2024
HYD: అరెస్ట్ ఎపిసోడ్.. పుష్పకు మరింత క్రేజ్
బన్నీ అరెస్టు వార్తతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. టీవీలలో ఎప్పటికప్పుడు వార్తలు చూస్తూ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఏం జరుగుతోందో అని టెన్షన్‌తో గడిపారు. అరెస్టు చేస్తారా, చేస్తే రిమాండ్ చేస్తారా, మరి బెయిల్ వస్తుందా అని టీవీలకు అతక్కుపోయారు. చివరకు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ అరెస్టు సీన్‌తో ఆయనకు మరింత క్రేజ్ పెరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.