News February 2, 2025
రాత్రి కాజీపేట్ రైల్వే స్టేషన్లో తనిఖీలు

నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను గుర్తించడం కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కాజీపేట పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాత్రి రైల్వే స్టేషన్లో తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులతో పాటు బ్యాగులను తనిఖీ చేశారు.
Similar News
News November 20, 2025
కైకలూరు: ప్యాసింజర్ రైలు ఢీకొని వ్యక్తి మృతి

కైకలూరు సమీపంలో నర్సాపూర్ ప్యాసింజర్ రైలు ఢీకొని సుమారు 60 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి గురువారం మృతి చెందారు. మృతుడు తెలుపు రంగు టీషర్ట్, సిమెంట్ కలర్ ప్యాంట్ ధరించినట్లు భీమవరం రైల్వే జీఆర్పీ ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. వివరాలు తెలిసినవారు 9908448729 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.
News November 20, 2025
కల్వకుర్తి: క్రీడలలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

చదువుతోపాటు క్రీడలలో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా యువజన క్రీడల అధికారి సీతారాం నాయక్ అన్నారు. కల్వకుర్తి పట్టణ సమీపంలోని సీబీఎం కళాశాల ఆవరణలోని ఎంజెపీ పాఠశాలలో నిర్వహించిన కబడ్డీ క్రీడాకారుల ఎంపికలను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News November 20, 2025
అక్రమ కేసులతో కట్టడి చేయాలనుకుంటే పొరపాటే: వేముల

అక్రమ కేసులతో బీఆర్ఎస్, కేటీఆర్‌ను కట్టడి చేయాలనుకోవడం పొరపాటేనని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా, హామీలు అమలు చేసేవరకు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతుంటామని ఆయన స్పష్టం చేశారు.


