News February 2, 2025

రాత్రి కాజీపేట్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు

image

నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను గుర్తించడం కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కాజీపేట పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాత్రి రైల్వే స్టేషన్‌లో తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులతో పాటు బ్యాగులను తనిఖీ చేశారు.  

Similar News

News February 19, 2025

వరంగల్: పెరిగిన మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి బుధవారం మొక్కజొన్న తరలి రాగా ధర భారీగా పెరిగింది. మంగళవారం మక్కలు(బిల్టీ)కి రూ.2,311 ధర రాగా నేడు రూ.2365 పలికిందని వ్యాపారులు తెలిపారు. ఒక రోజు వ్యవధిలోనే రూ.54 ధర పెరగడం రైతులకు కొంత ఉపశమనం కలిగించినట్టయింది. ధర మరింత పెరగాలని మొక్కజొన్న పండించిన రైతులు కోరుతున్నారు.

News February 19, 2025

బజార్హత్నూర్‌లో మృతదేహం లభ్యం

image

బజార్హత్నూర్ మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మండలంలోని కడెం వాగులో బుధవారం ఓ శవం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడి హత్యా? లేక ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

News February 19, 2025

విజయవాడలో జీబీఎస్ వైరస్ కలకలం

image

విజయవాడలో జీబీఎస్ వైరస్ కలకలం రేపింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలానికి చెందిన ఓ మహిళ (30) ఈనెల 18వ తేదీన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు జీబీఎస్ వైరస్‌గా అధికారులు నిర్ధారించారు. ఆమెను ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

error: Content is protected !!