News February 1, 2025
రానున్న 10 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి: BHPL కలెక్టర్

వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా రానున్న 10 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో గ్రామ పంచాయితీ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News November 8, 2025
ఎర్ర చందనం పరిరక్షణకు ఇతర రాష్ట్రాల సహకారం: పవన్ కళ్యాణ్

ఎర్ర చందనంను కాపాడుకోవడంలో ఇతర రాష్ట్రాల సహకారం అవసరం ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ముందు ఇంటిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఎర్రచందనం విషయంలో మనకు ఇతర రాష్ట్రాలకు మధ్య సమన్వయం కావాలని ఆయన అన్నారు. నేపాల్లో మన ఎర్ర చందనం దొరుకుతోందని, అన్ని రాష్ట్రాల మధ్య ఏపీకి ఒప్పందం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఎక్కడ దొరికినా అది మనకు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని స్పష్టం చేశారు.
News November 8, 2025
సిరిసిల్ల: ఆటో- బైక్ ఢీ.. పలువురికి తీవ్రగాయాలు

సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక- జగ్గారావుపల్లి గ్రామాల మధ్య రోడ్డుప్రమాదం జరిగింది. కొదురుపాక నుంచి ప్రయాణికులతో జగ్గారావుపల్లి వైపు వస్తున్న ఆటోను రాంగ్ రూట్లో వచ్చిన బైక్ ఢీ కొట్టింది. దీంతో ఆటో బోల్తా పడగా.. మద్యం మత్తులో ఉన్న బైకర్తో పాటు ఆటోలోని పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
News November 8, 2025
దొంగ-పోలీస్ గేమ్ ఆడుదామని అత్తను చంపేసింది!

AP: దొంగ-పోలీస్ గేమ్ పేరుతో అత్తను కోడలు చంపేసిన ఘటన విశాఖ(D) పెందుర్తిలో జరిగింది. మహాలక్ష్మీ(63), ఆమె కోడలు లలిత మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆమెపై పగ పెంచుకున్న కోడలు దొంగ-పోలీస్ ఆడుదామంటూ అత్త కళ్లకు గంతలతో పాటు కాళ్లు, చేతులు కట్టేసింది. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీపం అంటుకొని చనిపోయినట్లు PSకు సమాచారం అందించింది. అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.


