News April 14, 2025
రాపూరు హైవేపై ఘోరం.. ఇద్దరి మృతి

కారు ఇద్దరు రైతులను ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృత్యువాత పడ్డ ఘటన రాపూరులోని తిక్కనవాటిక పార్కు వద్ద సోమవారం చోటుచేసుకొంది. పార్కు వద్ద ప్రధాన రహదారిపై ఇద్దరు రైతులు వడ్లు ఎండబెట్టుకుంటున్నారు. ఆ సమయంలో ఓ కారు రాజంపేట వైపు నుంచి వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాపూరుకు చెందిన గంధం సరస్వతమ్మ(46), గార్లపాటి సురేశ్(26) అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News April 24, 2025
మధుసూదన్ ఇంటికి రానున్న Dy.CM పవన్

ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ భౌతికకాయానికి Dy.CM పవన్ కళ్యాణ్ నివాళులర్పించనున్నారు. ఆయన గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు కావలికి రానున్నట్లు అధికారులు తెలిపారు. అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.
News April 24, 2025
మరికాసేపట్లో మధుసూదన్ ఇంటికి మంత్రి ఆనం

ఉగ్రవాదుల దాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మధుసూదన్ కుటుంబాన్ని మంత్రి ఆనం పరామర్శించనున్నారు.
News April 24, 2025
నెల్లూరులో డిగ్రీ యువకుడి సూసైడ్

ఫెయిల్ కావడంతో ఓ యువకుడ సూసైడ్ చేసుకున్న ఘటన నెల్లూరులో జరిగింది. సిటీలోని హరనాథపురానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి(22) డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. మార్చి 31న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చెన్నైకి తీసుకెళ్లారు. తర్వాత నెల్లూరుకు తీసుకు వచ్చి ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అతను చనిపోయాడు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.