News February 10, 2025
రాప్తాడు వైసీపీలో ముసలం

రాప్తాడు వైసీపీలో ముసలం నెలకొంది. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, గోరంట్ల మాధవ్ మధ్య వివాదం ముదురుతోంది. మాధవ్ ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరగడంపై తోపుదుర్తి వర్గీయులు మండిపడుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఇటీవల ఐదుగురు వైసీపీ నేతలను తోపుదుర్తి సస్పెండ్ చేయించారు. ఈ క్రమంలో తోపుదుర్తిని వ్యతిరేకిస్తూ రామగిరి నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం కలకలం రేపింది.
Similar News
News March 28, 2025
తండ్రి మరణంలోనూ కుమార్తెకు ‘పరీక్ష’!

తండ్రి మరణంతో దుఃఖాన్ని దిగమింగుకుని పది పరీక్షలకు హాజరైంది ఓ విద్యార్థిని. ఉరవకొండ మం. రాకెట్లకు చెందిన రఘు(48) కూడేరు మండలం గొట్కూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రక్షిత పది పరీక్షలు రాస్తోంది. తన పెద్ద కుమార్తెను కాలేజీలో విడిచిపెట్టి తిరిగి బైక్‌పై వస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందారు. తండ్రి లేడన్న బాధను దిగమింగుకుని చిన్నకూతురు పరీక్ష రాసింది.
News March 28, 2025
వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పెన్నోబులేసు

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా మాల్యావంతం పెన్నోబులేసును నియమించారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు జగన్మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
News March 28, 2025
ఎన్టీఆర్ పింఛన్లకు రూ.127.76 కోట్లు మంజూరు

అనంతపురం జిల్లాలో ఏప్రిల్ 1న పంపిణీ చేయనున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీకి రూ.126.76 కోట్లు నిధులు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 2,79,165 మంది లబ్దిదారులకు పింఛన్లు ఇంటి వద్ద పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మొదటి రోజు సాంకేతిక కారణాలతో పంపిణీ జరగకుంటే రెండవ రోజు తప్పనిసరిగా ఇంటివద్ద అందిస్తారని పేర్కొన్నారు.