News February 10, 2025

రాప్తాడు వైసీపీలో ముసలం

image

రాప్తాడు వైసీపీలో ముసలం నెలకొంది. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, గోరంట్ల మాధవ్ మధ్య వివాదం ముదురుతోంది. మాధవ్ ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరగడంపై తోపుదుర్తి వర్గీయులు మండిపడుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఇటీవల ఐదుగురు వైసీపీ నేతలను తోపుదుర్తి సస్పెండ్ చేయించారు. ఈ క్రమంలో తోపుదుర్తిని వ్యతిరేకిస్తూ రామగిరి నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం కలకలం రేపింది.

Similar News

News December 4, 2025

6న అంబాజీపేటలో ఉమ్మడి తూ.గో. అండర్-17 క్రికెట్ జట్టు ఎంపిక

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-17 బాలుర క్రికెట్ జట్టును ఈ నెల 6న అంబాజీపేట జడ్పీహెచ్ స్కూల్లో ఎంపిక చేయనున్నట్లు డీఈవో షేక్ సలీం బాషా తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఉదయం 9 గంటలలోపు హైస్కూల్‌కు చేరుకుని వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాల కోసం ఎస్జీఎఫ్ కార్యదర్శులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

News December 4, 2025

కరీంనగర్: పంచాయతీ ఎన్నికల్లో మాజీ ఎంపీపీలు

image

పంచాయతీ ఎన్నికలలో సీనియర్ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ ఇన్‌ఛార్జ్ ఛైర్మన్‌గా, వైస్ ఛైర్మన్‌గా, వేములవాడ ఎంపీపీగా పనిచేసిన తీగల రవీందర్ గౌడ్ హనుమాజీపేట సర్పంచ్‌గా బరిలో నిలిచారు. చందుర్తి మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య చందుర్తి సర్పంచ్‌గా, వేములవాడ మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ వట్టెంల సర్పంచ్‌గా పోటీలో నిలవడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

News December 4, 2025

నాగిరెడ్డిపేట: MPDO, MPO సస్పెండ్

image

నాగిరెడ్డిపేట MPDO లలిత కుమారి, MPO ప్రభాకర్ చారీలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సస్పెండ్ చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించడం, సమయానుగుణంగా అధికారులకు వివరాలను అందించడంలో అలసత్వంగా వ్యవహరించడంతో జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా తమ ఇష్టానుసారంగా వెళ్లడంతో వేటు వేసింది. పంచాయతీ ఎన్నికలను అధికారులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.