News March 18, 2025
రాబిన్ హుడ్ డైరెక్టర్ది భద్రాద్రి జిల్లానే…

నితిన్ హీరోగా నటించిన మూవీ రాబిన్ హుడ్ ఈ నెల 28న విడుదలవుతోంది. కాగా ఆ మూవీని డైరెక్ట్ చేసిన వెంకీ కుడుములది కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట. కాగా ఆయన HYDలో ఉంటుండగా, పేరెంట్స్ అశ్వారావుపేటలో ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన భీష్మ, ఛలో సినిమాలు విజయం సాధించగా.. ఛలో మూవీకి ఉత్తమ తొలి దర్శకుడిగా సైమా అవార్డు అందుకున్నారు. కాగా ఆయన 2018లో ఛలో సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేయడం గమనార్హం.
Similar News
News November 1, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 01, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.15 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 1, 2025
స్పెషల్ ఆఫీసర్లు మండలాలకు వెళ్లాలి: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాలో నియోజకవర్గ, మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతి వారం తప్పనిసరిగా మండలాలకు వెళ్లి ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లు, సచివాలయాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో ఆమె మాట్లాడుతూ.. బీసీ హాస్టళ్లలో పదో తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచాలన్నారు. హాస్టళ్లలో తాగునీరు, భోజనం, టాయిలెట్లపై చర్యలు చేపట్టాలని సూచించారు.
News November 1, 2025
MHBD: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు వీరే.. UPDATE

హనుమకొండ జిల్లాలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కురవి మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. కురవి మండలం సుధనపల్లికి చెందిన యువతికి బుధవారం కురవిలో వివాహం అయింది. నవ దంపతులు అదే రాత్రి అత్తగారింటికి వెళ్లారు. గురువారం నవ దంపతులను తీసుకొస్తున్న క్రమంలో ఆగి ఉన్న బొలెరోను బోర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనాథ్, స్వప్న, కళమ్మ మృతి చెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి.


