News July 11, 2025

రాబోయే తరాల కోసం కృషి చేయాలి: డీఈవో

image

రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఈవో డాక్టర్ రాధా కిషన్ పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి నీరు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.

Similar News

News August 31, 2025

మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజావాణి

image

కలెక్టరేట్‌లో రేపు సోమవారం ప్రజావాణి హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని కలెక్టర్ తెలిపారు. సోమవారం ప్రజావాణి హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు. దీనిని ప్రజలు గమనించాలని కోరారు.

News August 31, 2025

జిల్లాలో భారీ నష్టం: మెదక్ కలెక్టర్

image

పకృతి విలయతాండవంతో జిల్లాలో భారీ నష్టం సంభవించినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. నిజాంపేట్ మండలంలో వరదలతో కోతకు గురైన వంతెనలు రోడ్లను పరిశీలించారు. 11 మండలాల్లో వర్షాల వరదలతో నష్టాలు కలగాయని, రెండు మండలాల్లో 300 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం, వరదల ప్రవాహంతో భారీ నష్టం సంభవించినట్లు వివరించారు. 130 గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధరించినట్టు వివరించారు.

News August 31, 2025

కాట్రియాల: వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

image

రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈరోజు పర్యటించారు. గ్రామంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. గ్రామంలో నీట మునిగిన పొలాలను, కొట్టుకుపోయిన బ్రిడ్జిని, చిన్న చెరువు కట్టను ఆయన పరిశీలించారు. నష్టపోయిన వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి కమ్మరి రమేశ్ ఉన్నారు.