News November 20, 2024
రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి: అంజాద్ బాషా
కూటమి ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపిస్తే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తారా అంటూ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రశ్నించారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఎవరో 2021లో పెట్టిన పోస్టుకు రవీందర్ రెడ్డిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారన్నారు. మూడు రోజులపాటు ముఖానికి ముసుగు వేసి ఎక్కడెక్కడో తిప్పి తీవ్రంగా కొట్టారన్నారు. రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
Similar News
News November 21, 2024
కడప: ప్రాధాన్యత రంగాలను పటిష్ఠం చేయాలి
ప్రాధాన్యతా రంగాలను పటిష్ఠం చేస్తేనే కడప జిల్లా అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆ దిశగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరకూరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు, పనుల పురోగతి, సాధించిన ప్రగతి తదితర అంశాలపై కలెక్టర్ సంబందిత అధికారులతో సమీక్షించారు.
News November 21, 2024
కడప జిల్లాలో దారుణ ఘటన
కడప జిల్లాలో గురువారం దారుణ ఘటన వెలుగుచూసింది. కాశినాయన మండలం చెన్నవరం – పాపిరెడ్డిపల్లి మధ్యలో 30 నుంచి 35 ఏళ్ల వయస్సు గల మహిళపై దుండగులు రాళ్ళతో దాడి చేసి చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రాళ్లతో తలను ఛిద్రం చేశారు. మహిళపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 21, 2024
ఉత్కంఠ రేపుతున్న వైఎస్ వివేకా హత్య కేసు
YS వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ స్పీడ్ అందుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వివేకా కుమార్తె YS సునీత CM చంద్రబాబుని కలిసి దీనిపై చర్చించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న MP అవినాశ్ రెడ్డికి ఇటీవల సుప్రీంకోర్టు నోటీసులు సైతం జారీ చేసింది. వివేకా PA కృష్ణారెడ్డి ఇంటికి విచారణ కోసం పోలీసులు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.