News November 5, 2024
రాబోయే రోజుల్లో వైసీపీ షటిల్ టీం అవుతుంది: ఎమ్మెల్యే బీవీ
రాబోయే రోజుల్లో వైసీపీ షటిల్ టీమ్ లాగా.. ఇద్దరే సభ్యులు నిలుస్తారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మిగనూరులో మంగళవారం కర్నూలు-బళ్లారి హైవే మరమ్మతులకు భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత వైసీపీకి క్రికెట్ టీమ్ ఉందని, భవిష్యత్తులో షటిల్ టీమ్‌గా మిగులుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
Similar News
News December 7, 2024
నేటి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత
శ్రీశైల క్షేత్రంలో వెలసిన మల్లికార్జున స్వామి స్పర్శదర్శనాన్ని శని, ఆది, సోమవారాల్లో తాత్కాలికంగా నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. శని, ఆది, సోమవారాల్లో క్షేత్రానికి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ఈ 3 రోజుల్లో ఉచిత స్పర్శదర్శన సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. తిరిగి మంగళవారం నుంచి శుక్రవారం వరకు యథావిధిగా స్పర్శ దర్శనం సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.
News December 7, 2024
చంద్రబాబుపై నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి బీసీ
సీఎం చంద్రబాబు నాయుడుపై నమ్మకంతోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మాట్లాడారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. ఇందు కోసం ఇప్పటికే నిధులను కేటాయించామన్నారు. త్వరలోనే పనులు పూర్తవుతాయని తెలిపారు.
News December 6, 2024
ప్రధానితో భేటీ అద్భుతమైన అనుభవం: మంత్రి భరత్
ప్రధాని మోదీని మంత్రి టీజీ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో కలిసి పలు అంశాలపై ఆయనకు వినతి పత్రం అందజేశారు. ‘ప్రధాని మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నా. గతంలో ఒక కమిటీకి ఛైర్మన్‌గా మా నాన్న టీజీ వెంకటేశ్ చేసిన కృషిని ఆయన గుర్తు చేసుకోవడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. పీఎంను కలిసి చర్చించే అవకాశం రావడం నాకు నిజంగానే ఒక అద్భుతమైన అనుభవం’ అని మంత్రి ట్వీట్ చేశారు.