News August 26, 2024
రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి: DK అరుణ
క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే పార్టీకి బలం, బలగం అని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు -2024 కార్యశాల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదులో అంకితభావంతో పనిచేసి ఒక్క కార్యకర్త 100 మందికి పార్టీ సభ్యత్వం ఇప్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలతో మమేకమై స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు.
Similar News
News November 27, 2024
ప్రధాని మోదీతో ఎంపీ డీకే అరుణ భేటీ
ప్రధాని నరేంద్ర మోడీతో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రధాని నిర్వహించిన కీలక సమావేశంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయాలపై చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు.
News November 27, 2024
MBNR: ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించిన సీఎం
న్యూఢిల్లీ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, గన్ని సంచులు, ప్యాడీ క్లీనర్స్, అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఆన్ లైన్లో నమోదు చేసి రైతులకు వెంటవెంటనే డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News November 26, 2024
మాగనూరు: జిల్లా పరిషత్ పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్
మాగనూరు మండల జిల్లా పరిషత్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన పునరావృతమైంది. మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. దాదాపు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన పునరావృతం అవ్వడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.