News October 11, 2024

రాబోయే 3 రోజులలో భారీ వర్షాలు: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో రాబోయే మూడు రోజులలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టీఎస్ చేతను పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావం వల్ల 14 నుంచి 16వ తేదీ వరకు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Similar News

News November 12, 2025

గుత్తిలో వ్యక్తి మృతి

image

గుత్తిలోని కర్నూల్ రోడ్డులో నిరుపయోగంగా ఉన్న హాస్టల్ ఆవరణలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 12, 2025

శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలి: ఎస్పీ

image

శాంత్రిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీలేకుండా పనిచేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. కేసుల ఛేదనకు టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులపై అలసత్వం వహించకుండా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని ఆదేశించారు.

News November 11, 2025

సిలిండర్ పేలి అనంతపురంలో వ్యక్తి మృతి

image

అనంతపురంలోని తపోవనంలో గ్యాస్ సిలిండర్ పేలి జిలాన్ బాషా (34) మృతిచెందారు. చిన్న సిలిండర్‌లో మోనో అమెనియం ఫాస్పేట్ నింపుతుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ క్రమంలో బాషాకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు జీజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.