News October 22, 2024

రాబోవు నాలుగు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో రానున్న నాలుగు రోజులలో కురువనున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు నిండుగా ప్రవహించే అవకాశం ఉందని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రత్న పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జాగ్రత్తలు చేపట్టాలని, కర్ణాటకలోని పరగోడు నిండి పొర్లుతున్నందున చిలమత్తూరు, గోరంట్ల, పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News November 2, 2024

పింఛన్ పంపిణీ.. అనంత 96.68, సత్యసాయి జిల్లాలో 94.63 శాతం పూర్తి

image

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పింఛన్ పంపిణీ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 8 గంటలకు అనంతపురం జిల్లాలో 96.68, సత్యసాయి జిల్లాలో 94.63 శాతం పంపిణీ పూర్తయింది. అనంత జిల్లాలో 2,82,554 మందికి గానూ 2,73,185 మందికి, సత్యసాయి జిల్లాలో 2,66,137 మందికి గానూ 2,51,848 మందికి పింఛన్ సొమ్ము అందింది. నిన్న సర్వర్ ప్రాబ్లంతో పంపిణీలో కొంత జాప్యం జరిగింది.

News November 2, 2024

పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూ సేకరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో ఎన్‌హెచ్ 342, 716జీ, జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ బెంగళూరు- కడప- విజయవాడకు సంబంధించిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారులకు సేకరించిన భూమి వివరాలను తెలుసుకున్నారు.

News November 1, 2024

ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

image

శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవరచెరువు మండలం కొండకమర్లలో మెహెతాజ్ (36) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. ఆమెకు కొంతకాలంగా ఇర్ఫాన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళ మరో వ్యక్తితో కూడా చనువుగా ఉందని అనుమానించిన ఇర్ఫాన్ రాత్రి ఆమెను హత్య చేశాడు. తానే చంపినట్లు శుక్రవారం పోలీసుల వద్ద వాంగ్మూలం ఇచ్చి లొంగిపోయాడు. ఓబులదేవరచెరువు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.