News February 8, 2025

రామంతపూర్‌లో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

ఉప్పల్ PS పరిధి రామంతపూర్‌లోని ఇందిరానగర్‌లో పదో తరగతి విద్యార్థిని(15) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గాంధీనగర్‌లోని ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అనంతరం ఇంటికి వచ్చాక తల్లి బయటకు వెళ్లింది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 20, 2025

రైతులకు గుడ్‌న్యూస్.. సోయా కొనుగోలు పరిమితి పెంపు

image

సోయా కొనుగోలు పరిమితిని ప్రభుత్వం పెంచిందని KMR జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి బుధవారం ప్రకటించారు. గతంలో ఎకరానికి 7.62 క్వింటాళ్లుగా ఉన్న పరిమితిని 10 క్వింటాళ్లకు పెంచడం జరిగింది. రైతులు తమ సోయాను తేమశాతం లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. రైతుల పేరుతో దళారులు ఎవరైనా కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు జరిపితే, సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

News November 20, 2025

ప్రొద్దుటూరు: మొబైల్ చూస్తూ డ్రైవింగ్.. మరణానికి నాంది!

image

మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, అలాగే మృత్యువుకు దారి వేసినట్లేనని ప్రకాశం పోలీస్ బుధవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రకాశం పోలీసులు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. ద్విచక్ర వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయరాదని, అటువంటి వారికి రూ.2 వేల జరిమానా లేక ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.

News November 20, 2025

కుక్క కాటు వల్ల చనిపోతే రూ.5 లక్షల పరిహారం

image

కుక్క కాటు వల్ల ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.5 వేలు ఇస్తామని, ఇందులో రూ.3,500 బాధితులకు, రూ.1,500 ట్రీట్మెంట్ కోసం అందజేస్తామని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆయుష్మాన్ భారత్-ఆరోగ్య కర్ణాటక స్కీమ్ కింద పాము కాటు బాధితులకు నగదు రహిత చికిత్స అందించాలని నిర్ణయించింది.