News February 8, 2025

రామంతపూర్‌లో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

ఉప్పల్ PS పరిధి రామంతపూర్‌లోని ఇందిరానగర్‌లో పదో తరగతి విద్యార్థిని(15) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గాంధీనగర్‌లోని ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అనంతరం ఇంటికి వచ్చాక తల్లి బయటకు వెళ్లింది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 13, 2026

నిరాశ్రయుల పట్ల సేవాభావంతో మెలగండి: మౌర్య

image

నిరాశ్రయుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య సూచించారు. గురువారం రాత్రి తిరుపతి పట్నూల్ వీధిలో మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న నిరాశ్రయుల కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఆహారం, వసతి సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఆర్.ఓ.వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

News February 12, 2026

సిరిసిల్ల: కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా సిరిసిల్ల, వేములవాడలలో ఏర్పాటు చేసిన కౌటింగ్ కేంద్రాల వద్ద 250 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత నిర్వహిస్తున్నామని, 163 BNSS (144 సెక్షన్) అమలు చేస్తున్నామన్నారు.

News February 12, 2026

KMR: మొదటగా లెక్కించేది పోస్టల్ బ్యాలెట్ ఓట్లే!

image

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. శుక్రవారం ఉదయం 8 గం.లకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటగా ఓటు హక్కు కలిగి ఉండి పోలింగ్ విధుల్లోని సిబ్బంది వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంటింగ్ అధికారులు లెక్కించనున్నారు. జిల్లాలో 385 మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్‌ల వారీగా ఓట్లు లెక్కిస్తారు.