News April 16, 2025
రామంతపూర్: హోమియో ఆసుపత్రికి రూ.29 కోట్లు

రామతాపూర్ ప్రభుత్వ హోమియోపతి ఫార్మసీ మందుల కొనుగోళ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు రాష్ట్ర బడ్జెట్లో రూ.29 కోట్లు కేటాయింపులు జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు పెంచడం కోసం ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆసుపత్రి వైద్య బృందం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో ఏకైక హోమియో ప్రభుత్వ ఆసుపత్రిగా అద్భుతమైన సేవలు అందిస్తోంది.
Similar News
News September 15, 2025
జాతీయ జెండా ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్ అది

సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో జరిగే కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం, ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
News September 15, 2025
ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్?

రూమర్డ్ బాయ్ఫ్రెండ్ రచిత్ సింగ్తో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. యాక్టింగ్ కోచ్ అయిన రచిత్తో హుమా ఏడాదికి పైగా డేటింగ్లో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పలు సందర్భాల్లో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఈక్రమంలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటిపై హుమా స్పందించాల్సి ఉంది.
News September 15, 2025
ANU: ఏపీ పీజీ సెట్ షెడ్యూల్ మార్పు

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీ పీజీ సెట్ – 2025 షెడ్యూల్లో మార్పులు జరిగాయని కన్వీనర్ ప్రొఫెసర్ రవికుమార్ తెలిపారు. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 17 వరకు, ఆన్లైన్ సర్టిఫికెట్ ధ్రువీకరణను 18 వరకు పొడిగించినట్లు ఆయన చెప్పారు. వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఈ నెల 20 వరకు జరుగుతుందని పేర్కొన్నారు.