News April 16, 2025

రామంతపూర్: హోమియో ఆసుపత్రికి రూ.29 కోట్లు

image

రామతాపూర్ ప్రభుత్వ హోమియోపతి ఫార్మసీ మందుల కొనుగోళ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు రాష్ట్ర బడ్జెట్లో రూ.29 కోట్లు కేటాయింపులు జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు పెంచడం కోసం ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆసుపత్రి వైద్య బృందం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో ఏకైక హోమియో ప్రభుత్వ ఆసుపత్రిగా అద్భుతమైన సేవలు అందిస్తోంది.

Similar News

News April 20, 2025

సీఎం విదేశీ పర్యటనపై బండి సంజయ్ ఫైర్

image

అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి జపాన్‌లో పర్యటిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆదివారం పెద్దపల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు కలసి బహిరంగ సభలు పెట్టి ముస్లిం ఓట్ల కోసం డ్రామాలు ఆడుతన్నాయని ద్వజమెత్తారు.

News April 20, 2025

HYD: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి

image

క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి దాయరలో ఆదివారం కొందరు యువకులు క్రికెట్ కోసం త్యాగి వెన్యూ గ్రౌండ్ బుక్ చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో క్రికెట్ ఆడుతూ ప్రణీత్ (32) ఒక్కసారి కుప్పకూలాడు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందినట్లు తెలుస్తోంది.

News April 20, 2025

తిరుపతిలో నూతన ఆసుపత్రిని ప్రారంభించిన కలెక్టర్

image

తిరుపతిలో నూతన ట్రామా కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఆదివారం మంగలం రోడ్ కరకంబాడ్ దగ్గర గల తిరుపతి ట్రామా కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్‌ను బోర్డు సర్టిఫైడ్ సర్జన్, పిల్లల ఆర్థోపెడిక్ సర్జన్ డా.దుర్గాప్రసాద్‌తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు.

error: Content is protected !!